మాస్క్‌ లేకుండా దొరికితే ₹5వేలు ఫైన్‌! - odisha impose 5k fine for not wearing mask in second time
close
Published : 09/04/2021 21:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ లేకుండా దొరికితే ₹5వేలు ఫైన్‌!

ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు

భువనేశ్వర్‌: కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతున్న వేళ ఒడిశా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మాస్క్‌ ధరించని వారిపై భారీగా జరిమానా విధించనున్నట్టు తెలిపింది. తొలిసారి, రెండోసారి మాస్క్‌ ధరించకపోతే రూ.2వేలు.. అదే తప్పు మళ్లీ చేస్తే మాత్రం రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

మరోవైపు, ఏప్రిల్‌ 10 నుంచి దేశంలోని ఎక్కడి నుంచైనా ఒడిశాకు వచ్చే ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరిగా తీసుకురావాలని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే తెలిపింది. ప్రయాణానికి 72గంటల ముందు పరీక్ష చేయించుకున్న నివేదిక లేదా టీకా వేయించుకున్నట్టు  ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఒకవేళ ఎవరైనా సరైన పత్రాలు చూపించకపోతే ఏడు రోజులు క్వారంటైన్‌ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

ఒడిశాలో గురువారం 879 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య  3,45,526కి పెరిగింది. వీరిలో 3,38,890మంది కోలుకోగా.. 1923మంది మృతిచెందారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని