టాలీవుడ్‌లో మరో విషాదం - producer annam reddy krishna kumar passes away
close
Updated : 26/05/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాలీవుడ్‌లో మరో విషాదం

కన్నుమూసిన నిర్మాత

హైదరాబాద్‌: సినీ ప్రముఖుల వరుస మరణవార్తలతో టాలీవుడ్‌లో విషాద వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే పరిశ్రమలో పేరు పొందిన గాయకుడు జి.ఆనంద్‌, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌జీతో పాటు రచయిత నంద్యాల‌ రవి, నటుడు టీఎన్‌ఆర్‌, పీఆర్వో బీఏ రాజుల వరుస మరణాలతో చిత్రపరిశ్రమలో ఆయా శాఖల్లో తీరని లోటు ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ తుదిశ్వాస విడిచారు. విశాఖలో ఉంటున్న ఆయన బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సాయిపల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌ జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కృష్ణకుమార్‌ మృతిచెందడంతో చిత్రబృందమే కాకుండా మొత్తం టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కృష్ణకుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

తరుణ్ కథానాయకుడిగా నటించిన ‘సఖియా నాతో రా’తో పాటు ‘ఈ పిల్లకి పెళ్ళవుతుందా’, ‘కలికాలం ఆడది’, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’, ‘ఈ దేశంలో ఒకరోజు’ చిత్రాలకు కృష్ణకుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా దర్శకుడు మారుతితో కలిసి ‘బెస్ట్ యాక్టర్స్’ చిత్రానికి కూడా ఈయన నిర్మాతగా ఉన్నారు. మరోవైపు కృష్ణకుమార్ భార్య జ్యోతి కొన్నేళ్ళ క్రితం కాలం చేశారు.‌ ‘వంశ వృక్షం’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘మరో మలుపు’, ‘మల్లె పందిరి’ తదితర చిత్రాలలో ఆమె కథానాయికగా నటించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని