కరోనా కాలం: చేపల చెరువుగా స్విమ్మింగ్‌పూల్‌! - resort converted as fish pond
close
Published : 29/08/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కాలం: చేపల చెరువుగా స్విమ్మింగ్‌పూల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నేపథ్యంలో పర్యాటక రంగం కుదేలైంది. దీంతో పర్యాటకులకు బస కల్పించే రిసార్టులు గత ఆరు నెలలుగా మూతపడే ఉన్నాయి. రిసార్టుల యజమాన్యాలు ఆదాయం లేక.. అక్కడి సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అలాంటి ఇబ్బందే పడ్డ ఓ రిసార్టు యాజమాన్యం సరికొత్త ఆలోచన చేసింది. రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌ను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉపయోగిస్తోంది.

కేరళలోని కుమరకోమ్‌లో ‘ది అవేదా రిసార్ట్స్‌ అండ్‌ స్పా’ రిసార్టులో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌ను రిసార్టు యాజమాన్యం చేపల చెరువుగా మార్చింది. అందులో చేపల్ని పెంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి ఆదాయం పొందాలని భావిస్తోంది. కరోనా దృష్ట్యా మార్చిలో ఈ రిసార్టు మూతపడటంతో ఆదాయం లేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేకపోయారట. కొద్ది నెలలు వేచి చూసినా ఇప్పట్లో రిసార్టు తెరిచే అవకాశాలు లేకపోవడంతో మరో ఆదాయ వనరు కోసం ఆన్వేషించగా ఈ ఉపాయం తట్టిందట.

దీంతో రిసార్టులో ఉన్న 7.5 మిలియన్‌ లీటర్ల నీరు పట్టే 150x50 మీటర్ల విస్తీర్ణం గల స్విమ్మింగ్‌పూల్‌లో జూన్‌ నెలలో 16వేల పెరల్‌ ఫిష్‌ చేప పిల్లల్ని వదిలారు. వీటి ద్వారా 4 మిలియన్‌ టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తారట. వీటిని విక్రయించగా వచ్చిన డబ్బును ఉద్యోగుల జీతాలు, రిసార్టు నిర్వహణ ఖర్చులకు వినియోగించాలనుకుంటున్నారు. ఒకవేళ ఆదాయం బాగుంటే పర్యాటక రంగం పునఃప్రారంభమైనా.. ఈ రిసార్టులో కాకుండా వేరే ప్రాంతాల్లో ఈ చేపల ఉత్పత్తిని కొనసాగిస్తామని అవేదా రిసార్ట్స్‌ యాజమాన్యం చెబుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని