స్మిత్‌ చూస్తుండగానే రోహిత్‌ షాడో బ్యాటింగ్‌ - rohit sharma shadow batting in gabba test
close
Published : 19/01/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్మిత్‌ చూస్తుండగానే రోహిత్‌ షాడో బ్యాటింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ గబ్బా పిచ్‌పై షాడో బ్యాటింగ్‌ చేశాడు. స్టీవ్‌స్మిత్‌ చూస్తుండగానే క్రీజులోకి వచ్చి ఫ్రంట్‌ఫుట్‌తో ఊహాత్మకంగా షాట్‌ ఆడాడు. ఆ తర్వాత నేరుగా అవతలి ఎండ్‌లోకి వెళ్లి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేశాడు. ఉద్దేశపూర్వకంగా చేశాడో? ఊరికే చేశాడో? తెలియదు గానీ మొత్తానికి ఆ వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

సిడ్నీలో టెస్టులో టీమ్‌ఇండియా వీరోచితంగా పోరాడిన సంగతి తెలిసిందే. ఆఖరి రోజు రిషభ్ పంత్‌ మెరుపులు మెరిపించాడు. అయితే విరామ సమయంలో స్టీవ్‌స్మిత్‌ క్రీజులోకి వచ్చి షాడో బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో అతడు పంత్‌ బ్యాటింగ్‌ గార్డ్‌ చెరిపివేసినట్టు వీడియోల్లో కనిపించింది. అతడు ఉద్దేశపూర్వకంగానే పంత్‌ గార్డ్‌మార్క్‌ చెరిపివేశాడని విమర్శలు వచ్చాయి.

ఆసీస్‌ క్రికెటర్లు అప్పుడు స్మిత్‌కు అండగా నిలిచారు.‌ అప్పుడప్పుడు క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌ చేస్తున్నట్టుగా ఊహించుకుంటాడని టిమ్‌పైన్‌ సహా మరికొందరు తెలిపారు. ఇప్పుడు స్టీవ్‌స్మిత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగానే రోహిత్‌ అలా చేయడం విస్మయపరిచింది. దీనిపై మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడాడు.

‘దురుద్దేశపూర్వకంగా స్టీవ్‌స్మిత్‌ పిచ్‌ను టాంపర్‌ చేశాడని చెప్పినవాళ్లంతా ఇప్పుడిది గమనించడం ముఖ్యం. ఎందుకంటే స్టీవ్‌స్మిత్‌ చేసినట్టే రోహిత్‌ శర్మ చేశాడు. నిజానికి అతడు కుడికాలితో ఒక అడుగు ముందుకు వేశాడు’ అని మంజ్రేకర్‌ అన్నాడు.

ఇవీ చదవండి
సిరాజ్‌.. ఇక కుర్రాడు కాదు
తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్‌ చేసిన సుందర్‌

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని