చరణ్‌-శంకర్‌ మూవీ: డైలాగ్‌లు మామూలుగా పేలవు! - sai madhav burra as writer for ram charan and shankar movie
close
Published : 13/07/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరణ్‌-శంకర్‌ మూవీ: డైలాగ్‌లు మామూలుగా పేలవు!

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందించనున్నారు. ప్రస్తుతం తెలుగులో బిజీగా రచయితల్లో సాయిమాధవ్‌ ఒకరు. పలు భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఆయన పని చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘హరిహర వీరమల్లు’ సహా ఇంకా కొన్ని చిత్రాలకు మాటలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

‘జెంటిల్‌మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను. థ్యాంక్స్‌ శంకర్‌ సర్‌, దిల్‌రాజు గారు, చరణ్‌బాబు’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే చరణ్‌-శంకర్‌ మూవీ పట్టాలెక్కనుంది. ఇందులో చరణ్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తారని టాక్‌. ‘ఒకే ఒక్కడు’ తరహాలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని తెలుస్తోంది. కథకు తగిన విధంగా పదునైన సంభాషణలు అందించటంటో సాయిమాధవ్‌ సిద్ధహస్తులు. అందుకే చిత్ర బృందం ఆయనను ఎంపిక చేసిందట. మరి సాయిమాధవ్‌ కలం నుంచి జాలువారిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు చరణ్‌ నోటి నుంచి వినాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని