Cinema News: ఓటీటీ కోసం మరొకటి? - samantha akkineni to feature in a trilingual web series
close
Updated : 13/06/2021 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఓటీటీ కోసం మరొకటి?

హైదరాబాద్‌: ‘ది ఫ్యామిలీమెన్‌ 2’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే అందరి మెప్పు పొందింది నటి సమంత. ఇందులో రాజీ అనే తమిళ ఈలం సోల్జర్‌గా ఆమె కనబర్చిన నటనకు సినీప్రియులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇప్పుడామె నుంచి మరో ఓటీటీ కబురు రానున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక.. సామ్‌తో ఓ భారీ వెబ్‌సిరీస్‌ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకి పెద్ద మొత్తంలో పారితోషికం ముట్టజెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే ఓటీటీ సంస్థకు చెందిన టీమ్‌ సమంతతో చర్చలు ప్రారంభించిందని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి కనబరుస్తుందని ప్రచారం వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని సమాచారం. త్వరలో దీనిపై మరింత స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శకుంతలం’ అనే పౌరాణిక చిత్రం చేస్తోంది సమంత. తమిళంలో నయనతారతో ‘కాతు వాకుల రెండు కాదల్‌’ సినిమాలో నటిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని