అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లొద్దు: కేజ్రీవాల్‌ - several hospitals will be converted into covid19 facilities again says kejriwal
close
Published : 12/04/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లొద్దు: కేజ్రీవాల్‌

దిల్లీ: కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో దిల్లీ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. దేశరాజధానిలో కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై కేజ్రీవాల్‌ సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ట్విటర్‌ ద్వారా ఇందుకు సంబంధించిన విషయాల్ని వెల్లడించారు. 

‘దిల్లీలోని ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. అంతేకాకుండా, పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులను మరోసారి పూర్తిస్థాయిలో కొవిడ్‌ చికిత్స కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయించాం’అని కేజ్రీవాల్‌ తెలిపారు. ‘ప్రజలు ప్రతి ఒక్కరు కొవిడ్‌ బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లకూడదు. అర్హులైన వారు వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవాలి’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  మరోవైపు, ఆస్పత్రుల్లో కొవిడ్‌ పడకల సంఖ్యను పెంచాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. 

దేశరాజధానిలో కరోనా వైరస్‌ రెండోదశ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దిల్లీలో 10,774 కరోనా కేసులు నమోదు కాగా, 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 7.25లక్షలకు చేరింది. ప్రస్తుతం అక్కడ 34వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని