అక్షయ్‌ ‘సూర్యవంశీ’ మరోసారి వాయిదా! - sooryavanshi release postponed
close
Published : 05/04/2021 19:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ ‘సూర్యవంశీ’ మరోసారి వాయిదా!

ముంబయి‌: అక్షయ్‌కుమార్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్‌, అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషించారు. పోలీస్‌ కథ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించారు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్ర విడుదలను మరోసారి వాయిదా వేశారు.

తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 30న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘సూర్యవంశీ’ విడుదల తాత్కాలికంగా వాయిదా వేశారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని