చావుని ఎగతాళి చేస్తున్నారు: తాప్సీ - taapsee pannu furious at haryana ministers comment on farmer deaths
close
Published : 15/02/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చావుని ఎగతాళి చేస్తున్నారు: తాప్సీ

మంత్రి కామెంట్‌పై నటి వ్యాఖ్యలు

ముంబయి‌: నిరసనల్లో మృతి చెందిన అన్నదాతలను ఉద్దేశించి హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్‌ చేసిన వ్యాఖ్యలపై నటి తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆకలి తీర్చే రైతుల జీవితాలను అపహ్యాసం చేస్తున్నారని ఆమె అన్నారు. అన్నదాతల నిరసనల్లో మృతి చెందిన 200 మంది రైతుల గురించి ఇటీవల దలాల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో ఉంటే మాత్రం వాళ్లు చనిపోకుండా ఉంటారా? కొన్ని లక్షల మంది జనాభాలో 200 మంది చనిపోరా? వాళ్లు తమ ఇష్టపూర్వకంగానే మృతిచెందారు’’ అని వ్యాఖ్యానించారు.

రైతుల మృతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వివాదాస్పదమయ్యాయి. దీంతో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై నటి తాప్సీ తాజాగా స్పందిస్తూ.. ‘మనిషి జీవితానికి విలువపోయింది! మన ఆకలి తీరుస్తున్న రైతుల జీవితానికి విలువపోయింది! అన్నదాతల మరణాలను అపహాస్యం చేస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు, రైతుల గురించి తాను అన్న మాటలకు మంత్రి దలాల్‌ క్షమాపణలు కోరారు.

ఇదీ చదవండి

నిరసనల వల్ల నటికి భద్రత పెంపుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని