నేరుగా ఓటీటీలోకి రష్మీ రాకెట్‌..! - taapsee pannu rashmi rocket will be a direct to digital release
close
Published : 02/06/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేరుగా ఓటీటీలోకి రష్మీ రాకెట్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాప్సీ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘రష్మీ రాకెట్‌’. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. కాగా.. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో కొంతకాలంగా కాస్త ఆసక్తి నెలకొంది. కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్‌ విడుదల కోసం మరికొంత కాలం ఎదురుచూస్తుందా అని చర్చలు సాగాయి. అయితే.. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఇప్పటికే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు పలు ఓటీటీ వేదికలతో చర్చలు కూడా జరుపుతున్నారట. మరికొన్ని రోజులో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

ఈ చిత్రంలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోరమైన సాధన చేసింది. అంతేకాదు ఆమె ప్రత్యేకంగా దుబాయ్‌లో శిక్షణ కూడా తీసుకుంది. ఈ సినిమా గురించి తాప్సీ ఒకసారి మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కథ విన్నప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు దాటి చిత్రీకరణ పూర్తి చేశామని ఆమె చెప్పింది. ఇటీవల మహిళా ప్రధాన్యమున్న కథలు ఎంచుకొంటూ వస్తోంది తాప్సీ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. భారత క్రికెటర్ మిథాలి రాజ్‌ బయోపిక్‌లోనూ ఆమె క్రికెటర్‌గా కనిపించనుంది. అది చిత్రీకరణ దశలో ఉంది. కాగా మరికొన్ని చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని