Vaccine Antibodies: యాంటీబాడీలు తగ్గుతున్నా.. వైరస్‌ నుంచి రక్షణే! - telugu news pfizer astrazeneca vaccine antibody levels may decline after 2 3 months lancet study
close
Updated : 27/07/2021 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine Antibodies: యాంటీబాడీలు తగ్గుతున్నా.. వైరస్‌ నుంచి రక్షణే!

లాన్సెట్‌ నివేదిక వెల్లడి

లండన్‌: కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు శరీరంలో సరైన మోతాదులో యాంటీబాడీలు వృద్ధి చెందడమే అత్యంత కీలకం. వైరస్‌ బారినపడి కోలుకోవడం ద్వారా లేదా వ్యాక్సిన్‌ పొందడం వల్ల ఇవి వృద్ధి చెందుతాయి. అయితే, ఇవి శరీరంలో ఎంతకాలం ఉంటాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 2నుంచి 3 నెలల్లో యాంటీబాడీల స్థాయి కాస్త తగ్గుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. లండన్‌ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమయ్యింది.

శరీరంలో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల స్థాయిలను అంచనా వేసేందుకు యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (UCL) పరిశోధకులు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు తీసుకున్న 600మందిపై అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకున్న ఆరు వారాల అనంతరం వారిలో యాంటీబాడీల స్థాయిలు తగ్గుతుండగా.. 10వారాల తర్వాత దాదాపు 50శాతానికి పడిపోతున్నట్లు గుర్తించారు. అయినప్పటికీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌లు సమర్థంగానే పనిచేస్తున్నాయని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోసు అవసరాన్ని పరిశోధకులు నొక్కిచెప్పారు. ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయన్న పరిశోధకులు, తక్కువ సంఖ్యలో నమూనాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఫలితాలను నిర్ధారించేందుకు మరింత అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, యాంటీబాడీల ప్రతిస్పందనలు ఒక్కో వ్యక్తిలో ఒక్కోవిధంగా ఉంటాయని.. వారిలోని టీ-కణాల ప్రతిస్పందనలు కూడా వేరుగా ఉంటాయని గుర్తిచేశారు. యాంటీబాడీల స్థాయిలు తగ్గుతున్నప్పటికీ.. రోగనిరోధక మెమొరీ వ్యవస్థ వల్ల కొవిడ్‌ నుంచి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

టీకాలు తీసుకున్న వారిలోనే ఎక్కువ యాంటీబాడీలు..

వైరస్‌నుంచి కోలుకున్న వారిలో వృద్ధి చెందే యాంటీబాడీలతో పోలిస్తే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లే ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫైజర్‌ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వెంటనే యాంటీబాడీలు గణనీయంగా పెరుగుతూ కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నాయని యూసీఎల్‌ ఇన్‌స్టి్ట్యూట్‌ ఆప్‌ హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్‌కు చెందిన డాక్టర్‌ మధుమిత శ్రోత్రి పేర్కొన్నారు. కానీ, టీకా తీసుకున్న రెండు, మూడు నెలల తర్వాత ఇవి తగ్గిపోవడాన్ని గమనించామన్నారు. అయినప్పటికీ కొవిడ్‌-19 నుంచి వ్యాక్సిన్‌లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని చెప్పారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని