Rakshasudu 2: పాన్‌ ఇండియా సినిమాగా ‘రాక్షసుడు-2’ - telugu news rakshasudu 2 latest update
close
Published : 02/08/2021 11:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rakshasudu 2: పాన్‌ ఇండియా సినిమాగా ‘రాక్షసుడు-2’

హైదరాబాద్‌: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రాక్షసుడు’. రమేష్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాక్షసుడు-2’ రూపుదిద్దుకోనుంది. ఇటీవల ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ‘రాక్షసుడు-2’ చిత్రానికి సంబంధించిన ఓ సరికొత్త అప్‌డేట్‌ను సోమవారం పంచుకుంది.

‘రాక్షసుడు’ కంటే మరింత ఉత్కంఠభరితమైన కథతో రూపుదిద్దుకోనున్న ‘రాక్షసుడు-2’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తీర్చుదిద్దుతున్నారు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఓ టాప్‌ నటుడ్ని ఇందులో హీరోగా చూపించనున్నారు. అలాగే, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ లండన్‌లో ప్రారంభం కానుంది. ఎ. హవీశ్‌ ప్రొడెక్షన్‌లో నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి కూడా రమేశ్‌ వర్మనే దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు రమేశ్‌ ప్రస్తుతం రవితేజతో ‘ఖిలాడీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని