Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at five pm
close
Published : 23/09/2021 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. అందని ద్రాక్షలా పౌష్టికాహారం: యునిసెఫ్‌ నివేదిక వెల్లడి

‘అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం?’.. అన్న దాశరథి నిలదీత నేటికీ జవాబు దొరకని ప్రశ్నే. ఆహార విధానాలపై ఈ వారం జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సుకు ముందుగా ‘యునిసెఫ్‌’ విడుదల చేసిన తాజా నివేదిక కూడా ఇదే చాటుతోంది. గత దశాబ్దకాలంలో రెండేళ్లలోపు చిన్నారులకు తగినంత పౌష్టికాహారం అందించలేకపోయామని, కొవిడ్‌-19 మహమ్మారి ఈ దుస్థితిని మరింత దిగజారుస్తోందని నివేదిక హెచ్చరించింది.

2. చంద్రబాబు అలా అనడం పద్ధతి కాదు: సుచరిత

పోలీసులను ఉపయోగించుకొని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అనడం సరైంది కాదని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రును హోంమంత్రి సందర్శించారు. తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణలో గాయపడిన వైకాపా కార్యకర్తలను సుచరిత పరామర్శించారు.

3. రేపటి నుంచి అసెంబ్లీ... ఏర్పాట్లపై సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ సమీక్ష

రేపట్నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్పీకర్, ప్రొటెం ఛైర్మన్‌ సమావేశమయ్యారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌ సమావేశంలో పాల్గొన్నారు. 

4. దేవి సీఫుడ్స్‌ కేసులో ఏపీ పిటిషన్‌ కొట్టివేత.. ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా

దేవి సీఫుడ్స్ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణ మినహాయింపు ఇవ్వాలని అందులో కోరింది. దీనిపై ఇవాళ సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు పిటిషన్‌ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించింది.

5. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ తగ్గుముఖం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఊరటనిచ్చే కబురు చెప్పింది. గత వారం మొత్తం 36 లక్షల కేసులు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే దాదాపు 4 లక్షల కేసులు తగ్గినట్లు వెల్లడించింది. ప్రధానంగా పశ్చిమ ఆసియాలో 22%, ఆగ్నేయాసియాలో 16% మేర కేసుల తగ్గుదల నమోదైనట్లు చెప్పింది.

6. తల్లుల నుంచి బిడ్డలకు అధిక స్థాయిలో యాంటీబాడీలు..!

ఏ జంకూ లేకుండా గర్భిణీలు కరోనా టీకా పొందొచ్చని, వారి నుంచి అధిక సంఖ్యలో యాంటీబాడీలు బిడ్డలకు వెళ్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు పొందిన వారిపై ఈ అధ్యయనం సాగినట్లు పరిశోధకులు చెప్పారు. అందుకోసం బొడ్డుతాడు రక్తం (అంబిలికల్ కార్డ్ బ్లడ్‌)లో ఉన్న యాంటీబాడీల స్థాయిలను పరిశీలించారు. 

7. దారుణం..మహారాష్ట్రలో అత్యంత క్రూరమైన అత్యాచార ఘటన

మహారాష్ట్రలోని ఠాణెలో అత్యంత క్రూరమైన అత్యాచార ఘటన జరగింది. బాలికపై 30 మంది కామాంధులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఓ యువకుడు అసభ్యకరంగా బాలిక వీడియోలు తీశాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని 30మంది దారుణానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారం ఘటనపై కేసు నమోదు చేసిన ఠాణె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 26 మందిని అరెస్టు చేసినట్టు  తెలిపారు.

8. రాష్ట్రాలు ఒప్పుకోవు.. పెట్రోల్‌ ధరలు తగ్గవు..!

పెట్రోల్‌, డీజిల్‌ వంటి చమురు ఉత్పత్తులు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవని, అందుకే దేశంలో పెట్రోల్‌ ధరలు దిగివచ్చే అవకాశాలు లేవని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి అన్నారు. భవానీపూర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కోల్‌కతా వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

9. న్యూజిలాండ్ జట్టు వెళ్లిపోవడానికి భారత్ కారణమట! 

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. తమ దేశంలో న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు మ్యాచ్‌లు రద్దు చేసుకొని వెళ్లిపోవడానికి భారత్ కారణమంటూ నెపం మోపింది. భద్రతా కారణాలతో కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌లో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసుకొని న్యూజిలాండ్ స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

10. దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ రన్‌.. కొత్త గరిష్ఠాలకు సూచీలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి రికార్డులు బ్రేక్‌ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలతో సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు మార్చకపోవచ్చన్న అంచనాలు, చైనా స్థిరాస్తి దిగ్గజం వివరణ ఇవ్వడం మార్కెట్ల దూకుడుకు కారణమైంది. సెన్సెక్స్‌ దాదాపు వెయ్యి పాయింట్ల లాభంతో 60వేల మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది. నిఫ్టీ 17,800 పైన ముగిసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని