‘ఆచార్య’ టీజర్‌పై వరుణ్‌ ఫన్నీ మీమ్‌ చూశారా? - varun tej joins the meme fest of acharya
close
Published : 27/01/2021 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’ టీజర్‌పై వరుణ్‌ ఫన్నీ మీమ్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా ‘ఆచార్య’. కాజల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 29 సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ తాజాగా ప్రకటించారు.

టీజర్‌ విషయంలో మంగళవారం సాయంత్రం చిరు-కొరటాల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఫన్నీ మీమ్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అన్నమాట ప్రకారం టీజర్‌ విడుదల తేదీని ప్రకటించిన కొరటాలకు చిరు బుధవారం ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుణ్‌ కూడా ఓ ఫన్నీ మీమ్‌ను షేర్‌ చేశారు. ‘చరణ్‌ అన్న వాయిస్‌ ఓవర్‌ అంటగా టీజర్‌కి.. బయట టాక్‌..’ అంటూ చిరంజీవి, రామ్‌చరణ్‌లను ట్యాగ్‌ చేస్తూ బ్రహ్మానందం ఇమేజ్‌తో చేసిన మీమ్‌ను పంచుకున్నారు. ఇదిగో అదే మీమ్‌. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా నవ్వులు పూయిస్తోంది. వరుణ్‌ సరదాగా ఈ మీమ్‌ షేర్‌ చేశారా? లేక నిజంగా రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ చెప్పారా? తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే!

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చదవండి

‘ఆచార్య’.. బిగ్‌ అనౌన్స్‌మెంట్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని