భారత్‌కు ఇలా కొనసాగడం నమ్మశక్యంగా లేదు   - virat kohli felt happy for captaining so long and
close
Published : 04/03/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌కు ఇలా కొనసాగడం నమ్మశక్యంగా లేదు  

ధోనీతో సమానంగా నిలిచిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ (60 మ్యాచ్‌లు) రికార్డును కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సమం చేశాడు. మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు.. కోహ్లీ కెరీర్‌లో కెప్టెన్‌గా 60వ మ్యాచ్‌గా నిలిచింది. దీంతో విరాట్‌ కోహ్లీ మాజీ సారథితో సమానంగా నిలిచాడు. అలాగే గతవారం పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించడంతో స్వదేశంలో అత్యధిక టెస్టు విజయాలు(22) సాధించిన సారథిగానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఇది ధోనీ(21)పేరిట ఉండేది.

ఈ విషయంపై మాట్లాడిన కోహ్లీ.. టీమ్‌ఇండియాకు ఇంతకాలం కెప్టెన్‌గా కొనసాగడం నమ్మశక్యంగా లేదన్నాడు. తన సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్‌లో మంచి ఫలితాలు సాధించిందని చెప్పాడు. భారత జట్టులో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, వాళ్లంతా తన దృష్టిని ఆకర్షించారని కోహ్లీ అన్నాడు. నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా ఇంకా మెరుగ్గా ఆడాల్సి ఉందని, ఇంగ్లాండ్‌ కూడా బలమైన జట్టేనని తెలిపాడు.

ఇప్పటికే 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్‌ గట్టి పోటీ ఇచ్చినా భారత్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకొని న్యూజిలాండ్‌తో తుదిపోరుకు సిద్ధపడుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఎలా ఆడనుందో చూడాలి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని