ముంబయి: ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన వెబ్‌సిరీస్ ‘తాండవ్’ ఆది నుంచి వివాదాల్లోనే ఉంటోంది. ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్లో సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే ఈ సిరీస్‌లో ఓ మతానికి సంబంధించిన దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలు, వ్యాఖ్యలు ఉన్నాయని ఇప్పటికే పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్ర కర్ణిసేన అధ్యక్షుడు అజయ్ సెనగర్ ఇదే అంశంపై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తాండవ్’పై ఆయన అభ్యంతరం తెలుపుతూ ‘ఆ వెబ్‌సిరీస్‌లో మన దేవుళ్లను కించపరిచిన వారి నాలుక తెగ్గోసిన వారికి రూ.కోటి రివార్డు ప్రకటిస్తున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ‘తాండవ్’ వివాదంపై ఇప్పటికే ఆ సిరీస్ మేకర్స్ క్షమాపణలు తెలిపారు. అయినప్పటికి అవేవీ సరిపోవంటూ అజయ్ అనటం గమనార్హం.
ఇవీ చదవండి!
మార్చి 11న విడుదలకు ‘శ్రీకారం’
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’