పర్యాటకులూ... వెల్‌కమ్‌! - countries allowing travellers from india on tourist visa: latest rt-pcr quarantine guidelines
close
Updated : 22/06/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పర్యాటకులూ... వెల్‌కమ్‌!

 భారతీయులకు ఏ ఏ దేశాలు షరతులతో స్వాగతం పలుకుతున్నాయ్‌ అంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా దెబ్బకు పర్యాటక రంగం జోరు పూర్తిగా సన్నగిల్లింది. ఫస్ట్‌వేవ్‌ అనంతరం తగు జాగ్రత్తలు తీసుకొని.. భారత్‌, దుబాయ్‌, మాల్దీవ్స్‌.. అన్నీ దేశాలు పర్యాటకులకు స్వాగతం పలికాయి. కానీ సెకండ్‌ వేవ్‌ వాటికి బ్రేక్‌ వేసింది. వైరస్‌ వేగంగా వ్యాపించడంతో భారత్‌తో సహా అన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఇప్పుడు కరోనా కేసుల సంఖ్యల మళ్లీ అదుపులోకి రావడంతో అన్ని దేశాలు అంతర్జాతీయ రాకపోకలకు అనుమతిచ్చాయి. ఇంటికే పరిమితమైన పర్యాటకులను అలరించేందుకు ఈసారి షరతులను తు.చా తప్పకుండా పాటించాలని చెబుతున్నాయి ఆయా దేశాలు. చేతిలో విజిటర్‌ వీసాతో పాటు వ్యాక్సిన్‌, కొవిడ్‌ నియమ నిబంధనలను పాటిస్తే..  పర్యాటకులు ఎక్కడెక్కడికి వెళ్లిరావొచ్చో.. ఓ లుక్కెద్దాం.. పదండి

మారిషస్‌@ 15జులై
బీచ్‌లకు మారిషస్‌ పెట్టింది పేరు. 15 జులై నుంచి అంతర్జాతీయ పర్యాటకులకు స్వాగతం పలకనుంది. ఈఏడాది నుంచి దశల వారీగా పర్యాటకులకు అనుమతిచ్చింది మారిషస్‌. తొలిదశ 15జులై నుంచి 30 సెప్టెంబరు ప్రారంభం కానుంది. మరి షరతులు ఏమిటంటే..
తొలిదశలో..
* వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. రిసార్ట్‌లో రెండు వారాల పాటు బస చేసినట్లైతే కచ్చితంగా నెగటివ్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. 
* 18 ఏళ్లు దాటిన పర్యాటకులు కచ్చితంగా రెండు డోసుల టీకా పొంది ఉండాలి.
* ప్రయాణానికి 5-7 రోజుల ముందు నెగిటివ్‌ ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి.
* అలాగే మారిషస్‌ విమానాశ్రయంలో దిగిన తరువాత పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు మారిషస్ కు వచ్చిన 7, 14వ రోజు తప్పక పరీక్ష చేయించుకోవాలి.

అక్టోబర్‌ నుంచి
* అక్టోబర్‌ 1,2021 నుంచి నెగిటివ్ రిపోర్టుతో పాటు టీకా పొందిన పర్యాటకులకు ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు.
* మొదటి, రెండో దశల్లో.. వ్యాక్సిన్‌ తీసుకోని పర్యాటకులు నియమ నిబంధనలను అనుసరించి, రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. 

ఈజిప్ట్‌.. టెస్టు తప్పనిసరి
* ప్రస్తుతం డెల్టా ప్లస్‌ కొవిడ్‌ కలవరపెడుతున్న తరుణంలో.. అన్ని దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు కచ్చితంగా టెస్టులు చేయాలని ప్రకటించింది ఈజిప్ట్‌ దేశం. 
* విమానాశ్రయంలో నిర్వహించే ర్యాపిడ్‌ కొవిడ్‌ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
* గతంలో తమ దేశంలోకి ప్రవేశించేందుకు ఎలాంటి అవసరం లేదని ఈజిప్ట్‌ పేర్కొన్నప్పట్టికీ.. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈ మార్పులు చేసింది. అటు ఈజిప్ట్‌లోనూ కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

రష్యా.. ఈసారి టిక్కెటు ధర ఎక్కువే..
భారతీయ పర్యాటకులకు అనుమతిచ్చిన కొద్ది దేశాల్లో రష్యా ఒకటి. అయితే థర్డ్‌వేవ్‌, డెల్టా వైరస్‌ దృష్ట్యా కాస్త కఠిన ఆంక్షలే అమలు చేయనుంది. అవేంటంటే 
* కేవలం హోటల్‌ రిజర్వేషన్‌ ఉంటే సరిపోదు.. ప్రభుత్వం ధ్రువీకరించిన టూరిస్ట్‌ ఏజెన్సీల నుంచి అనుమతి  తప్పనిసరి.
* ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు రష్యా వెళ్లేందుకు.. 30రోజుల విజిటర్‌ వీసా తప్పనిసరి
* ప్రయాణానికి 72 గంటల ముందు నెగటివ్‌ ఆర్టీపీఆర్‌ రిపోర్టుతో పాటు.. అక్కడికి చేరుకున్నాక ఒక పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
*  నెగటివ్‌ వస్తేనే దేశంలోకి అనుమతి లేని పక్షంలో కొవిడ్‌ చికిత్సా కేంద్రానికి పంపిస్తారు.
* ప్రస్తుతం రష్యాకు తక్కువ విమాన సర్వీసులు ఉండటంతో సాధరణ ధర కంటే 2.5 శాతం ఎక్కువ టికెట్టు ధర ఉండనుంది.

ఐస్‌ల్యాండ్‌.. కొవీషీల్డ్‌ టీకా వేసుకుంటేనే
* ఐరోపాలో ఐస్‌ల్యాండ్‌లోకి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవేశించాలంటే కచ్చితంగా వ్యాక్సిన్‌ తప్పనిసరి.
* అంతేకాదు.. విమానాశ్రయంలో వ్యాక్సిన్‌ తీసుకున్న సర్టిఫికెట్ తో పాటు నెగటివ్‌ ఆర్టీపీఆర్‌ టెస్టు రిపోర్టు చూపించాల్సి ఉంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని