TNR కుటుంబానికి నిర్మాణ సంస్థ సాయం - prime show entertainment donates 1 lakh to tnr family
close
Published : 12/05/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TNR కుటుంబానికి నిర్మాణ సంస్థ సాయం

హైదరాబాద్‌: కరోనాతో పోరాటం చేసి ఇటీవల కన్నుమూసిన ప్రముఖ జర్నలిస్ట్‌, సినీ నటుడు టీఎన్‌ఆర్‌ కుటుంబానికి ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణ సంస్థ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. టీఎన్‌ఆర్‌ కుటుంబానికి తమ వంతు సాయంగా రూ.1 లక్షను తక్షణమే అందచేయనున్నట్లు తెలిపింది. ‘ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, వ్యాఖ్యాత, సినీ నటుడు టీఎన్‌ఆర్‌ ఆకస్మిక మరణవార్త విని మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. తక్షణ ఖర్చుల నిమిత్తం టీఎన్‌ఆర్‌ కుటుంబానికి రూ.1 లక్షను ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. మరోవైపు చిరంజీవి, నటుడు సంపూర్ణేష్‌బాబు సైతం టీఎన్‌ఆర్‌ కుటుంబానికి తమ వంతు సాయాన్ని ప్రటించిన విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని