close
Published : 29/03/2021 19:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్టీఆర్‌ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు?

ఇంటర్నెట్‌ డెస్క్: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్. ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ రాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణుడిగా నటిస్తున్నారు.

 ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’, ‘చౌడప్ప నాయుడు’ వంటి పేర్లను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ పేరును ఫైనల్‌ చేస్తారా? లేదా మరో పేరు పెడతారనేది తెలియాల్సి ఉంది. ఇందులో కథానాయికగా రష్మిక, పూజా హెగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ - ఎన్టీఆర్‌ చిత్రంలోనే తెలుగు సినీరంగ ప్రవేశం చేస్తుందనే వార్తలు అప్పట్లో వైరలయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని