‘రంగ్‌దే’ ట్రైలర్‌ వచ్చేసింది! - nithiin and keerthy suresh rang de trailer
close
Updated : 19/03/2021 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రంగ్‌దే’ ట్రైలర్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: నితిన్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. కీర్తి సురేశ్‌ కథానాయిక. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులు పంచుతూ ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

‘మనల్ని ప్రేమించే వాళ్ల విలువ.. మనం వాళ్లను వద్దనుకున్నప్పుడు కాదు.. వాళ్లు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది’ వంటి సంభాషణలు అలరిస్తున్నాయి. పీవీడీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈనెల 26న ‘రంగ్‌దే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని