ఆ సినిమా విషయంలో పవన్‌కు త్రివిక్రమ్‌ సాయం చేస్తున్నారా? - trivikram one more help for pawan kalyan
close
Published : 18/09/2021 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమా విషయంలో పవన్‌కు త్రివిక్రమ్‌ సాయం చేస్తున్నారా?


ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలే కాదు, సాహిత్యం, పుస్తకాల గురించి తరచూ ఇరువురు చర్చించుకుంటారు. ప్రస్తుతం పవన్‌ నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ కోసం త్రివిక్రమ్‌ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కాగా, ఇప్పుడు పవన్‌ కోసం మరో సాయం చేసేందుకు ముందుకు వచ్చారట త్రివిక్రమ్‌. తన సొంత బ్యానర్‌ పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌తో పవన్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఇందుకు సంబంధించిన వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన కథ, దర్శకుడిని వెతికే బాధ్యత త్రివిక్రమ్‌కు అప్పగించారట. ఇప్పటికే త్రివిక్రమ్‌ కొన్ని కథలను వింటున్నట్లు తెలుస్తోంది. మరి చరణ్‌ కోసం త్రివిక్రమ్‌ ఎలాంటి కథను సూచిస్తారు? దర్శకుడు ఎవరు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని