అప్పుడే బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తా: నాని - nani opens about bollywood entry
close
Published : 09/05/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడే బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తా: నాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది నటులకు బాలీవుడ్‌ అంటే కొంచెం క్రేజ్‌ ఎక్కువే. అందుకే.. తమ ఇండస్ట్రీల్లో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు టాలీవుడ్‌ పరిశ్రమ అతీతం కాదు. మన స్టార్‌ హీరోల్లో చాలామంది హిందీలో చేసినవాళ్లున్నారు. అయితే.. ఇప్పటివరకూ బాలీవుడ్‌లో అడుగుపెట్టని స్టార్‌ హీరో నాని బీటౌన్‌ ప్రవేశంపై తన మనసులోని మాట బయటపెట్టాడు. బాలీవుడ్‌ సినిమా చేయాలనే ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని, అయితే.. తనకు వచ్చిన హిందీతో బాలీవుడ్‌లో రాణించడం కష్టమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఏదేమైనా.. మంచి కథతో పాటు డైరెక్టర్‌ దొరికితే తప్పకుండా బాలీవుడ్‌లో సినిమా చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

తన సహజమైన నటనతో తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్న నటుడు నాని. కొత్తతరహా కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటించిన ‘టక్‌ జగదీష్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నదమ్ముల కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. దీంతో పాటు నాని, సాయి పల్లవి జంటగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ తెరకెక్కుతోంది. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ‘జెర్సీ’ సినిమాతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఇప్పుడు ఆ చిత్రం అక్కడ రీమేక్‌ అవుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని