నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె!

తాజా వార్తలు

Published : 13/02/2020 01:06 IST

నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె!

బెంగళూరు: వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తున్నాడన్న అనుమానంతో నిద్రిస్తున్న భర్తపై ఓ భార్య మరుగుతున్న నూనె పోసింది. ఇటీవల బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మంజునాథ్‌ (40) కుటుంబంతో కలిసి యశ్వంత్‌పూర్‌లోని మోహన్‌కుమార్‌ నగర్‌లో నివసిస్తున్నారు. పద్మతో 9 ఏళ్ల క్రితమే వివాహం కాగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మంజునాథ్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న విషయంలో ఈ జంట మధ్య తరచూ గొడవ జరుగుతుండేది.

శనివారం కూడా ఇదే విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆదివారం ఉదయం 7 గంటలకు సుమారు లీటరు వేడి నూనెను తన భర్తపై పోసిన పద్మ.. పిల్లలతో సహా ఇల్లు విడిచి పారిపోయారు. బాధతో అరుస్తూ ఇంటి బయటకు వచ్చిన మంజునాథ్‌ను ఇరుపొరుగు వారు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ.. మంజునాథ్‌ శరీరం 50 శాతం మేరకు కాలిపోయింది. ఆయనకు ముఖం, చేతులు, భుజాలపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని