close
Array ( ) 1

తాజా వార్తలు

బస్తీ నేత వద్ద బొమ్మ తుపాకీ కలకలం!

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కత్తుల దాడిలో గాయపడిన సింగాడ బస్తీ నేత వద్ద బొమ్మ తుపాకీ వ్యవహారం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని సింగాడబస్తీలో నివసించే ఇజాజ్‌ అహ్మద్‌పై రెండు నెలల కింద కొందరు స్థానికులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇజాజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొంది ప్రాణాలు దక్కించుకున్నాడు. వారం రోజుల క్రితం సింగాడబస్తీకి వెళ్లగా స్థానికులు ర్యాలీ తీశారు. ర్యాలీలో భాగంగా తీసిన ఫొటోల్లో ఇజాజ్‌ తుపాకీ ధరించి ఉన్నట్లు సోమవారం వెలుగులోకి రావడం కలకలం రేపింది. అతన్ని బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బొమ్మ తుపాకీగా తేలింది. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాణభయంతోనే తుపాకీ ధరించినట్లు పోలీసులకు అతడు తెలిపాడు. ఇజాజ్‌ గతంలో తుపాకీ కావాలంటూ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. బొమ్మ తుపాకీ ప్రదర్శించడం వల్ల ప్రజలకు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందని, ఇలాంటి పనిచేయవద్దని అతడికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వదిలిపెట్టారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.