TS News: చితకబాది చంపేశారు
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 06:50 IST

TS News: చితకబాది చంపేశారు

పోలీసులనే చలింపజేసిన బాలుడి హత్యోదంతం

జీడిమెట్ల, న్యూస్‌టుడే: అన్నం తినట్లేదని అమ్మ ఓ దెబ్బ కొట్టింది.. ఇదే అదనుగా తీసుకున్న పక్కనే ఉన్న ఆమె ప్రియుడు ఆ పసికందును చితకబాదాడు. విచక్షణారహితంగా కాలితో తంతూ.. ప్రాణం పోయేదాకా కొట్టాడు. దీనికి ఆ తల్లి సాయమందించింది. ఈనెల 8న జీడిమెట్ల ఠాణా పరిధిలో జరిగిన మూడేళ్ల బాలుడి హత్యోదంతం కేసులో ఈ నిజాల్ని నిర్ధారించారు పోలీసులు. ఇద్దరూ కటకటాల పాలయ్యారు. హత్యోదంతం విని పోలీసులే చలించడం గమనార్హం. గురువారం వారిని రిమాండ్‌ చేసినట్లు జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపారు.

తల్లిదండ్రులదీ ప్రేమ వివాహమే: హత్యకు గురైన బాలుడి.. తల్లిదండ్రులు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయ, జగద్గిరిగుట్టకు చెందిన సురేశ్‌లదీ ప్రేమ వివాహమే. అన్నావదినలు అంటూ వారికి దగ్గరయ్యాడు కర్ణాటకకు చెందిన భాస్కర్‌. తన వద్దే సురేశ్‌ను పనిలో పెట్టుకున్నాడు. సురేశ్‌ని పనికి పంపి ఉదయకు దగ్గరయ్యాడు. ఓ రోజు సురేష్‌ ఇద్దరినీ ఏకాంతంగా చూశాడు. భర్త గొడవ పడడంతో చెప్పకుండా కొడుకుతో వెళ్లిపోయి చింతల్‌ భగత్‌సింగ్‌నగర్‌లో అద్దెకు ఉంటోంది. భాస్కర్‌తో సంబంధానికి బాబు అడ్డంగా ఉన్నాడని వదిలించుకొనేందుకు పన్నాగం పన్నింది. గత మంగళవారం వైరుతో తీవ్రంగా కొట్టి ప్రాణం పోయేలా చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని