లైంగిక దాడి చేసి చంపేశాడు: అర్బన్‌ ఎస్పీ

తాజా వార్తలు

Updated : 20/03/2021 12:15 IST

లైంగిక దాడి చేసి చంపేశాడు: అర్బన్‌ ఎస్పీ

భార్గవ తేజ మృతి కేసు ఛేదించిన గుంటూరు పోలీసులు

గుంటూరు నేరవార్తలు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఈ నెల 14వ తేదీన జరిగిన భార్గవ తేజ(6) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. తప్పిపోయిన భార్గవ తేజ మృతదేహం పొదల్లో లభించడం, శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెల్లంపూడి గ్రామానికి చెందిన గోపీ అనే యువకుడు బాలుడిని హత్య చేసినట్లు విచారణలో తేలిందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 

ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘చెడు సావాసాలకు అలవాటు పడిన నిందితుడు గోపీ చిన్న పిల్లలను అపహరించి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఎదురు తిరిగితే హతమార్చేవాడు. చంపేసిన అనంతరం కూడా లైంగికంగా దాడి చేసేవాడు. పోలీసుల విచారణలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. గత నెల 11వ తేదీన ఇదే తరహాలో వడ్డేశ్వరంలో మరో బాలుడిని అపహరించి లైంగిక దాడికి పాల్పడి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఆ బాలుడి మృతదేహాన్ని సమీపంలోని కృష్ణానదిలో పడేసినట్లు తెలిపాడు. ఆ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం’’ అని ఎస్పీ తెలిపారు. విచక్షణ లేకుండా ఒక సైకోలా ప్రవర్తి్స్తున్న నిందితుడు గోపీ సమాజంలో తిరిగితే ప్రమాదకరమని.. త్వరగా చార్జ్‌షీట్‌ నమోదు చేసి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని