8 ఏళ్ల విద్యార్థిపై లైంగిక దాడి చేసిన ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష

ప్రధానాంశాలు

Updated : 17/09/2021 20:07 IST

8 ఏళ్ల విద్యార్థిపై లైంగిక దాడి చేసిన ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష

కేశవగిరి, న్యూస్‌టుడే: మూడో తరగతి విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ హాకా భవన్‌లోని అత్యాచార, పోక్సో కేసులు విచారించే ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు సంచలన తీర్పిచ్చింది. అంతేకాకుండా రూ.10వేల అపరాధ రుసుం చెల్లించాలంటూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ కథనం ప్రకారం.. బార్కస్‌లోని లయోలా మోడల్‌ స్కూలులో బాలాపూర్‌ పరిధిలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన కె.జ్యోతి(27) 2017లో ఆయాగా చేరింది. పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న  బాలుడు(8) బాత్‌రూంలోకి వెళ్లగానే ఆయా వెనకాలే వెళ్లి లైంగికంగా దాడికి దిగింది. పలుమార్లు ఇలా అకృత్యానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ  సిగరెట్‌, లైటర్‌తో బాలుడి చేతివేళ్లు, కాలివేళ్లపై కాల్చి భయపెట్టింది. కాలిన గాయాలను తల్లి గమనించి ఆరా తీయగా బాలుడు విషయం బయటపెట్టాడు. దీంతో బాలుడి తండ్రి చాంద్రాయణగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశాడు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువు కావడంతో ఆయాకు శిక్ష పడిందని సీఐ తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన