మహిళపై సామూహిక అత్యాచారం

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:06 IST

మహిళపై సామూహిక అత్యాచారం

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఠాణా పోలీసులకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్‌ పురానాపూల్‌కు చెందిన ఓ మహిళ(30) బుధవారం సాయంత్రం హైదర్‌గూడలోని కల్లు దుకాణంలో ఉండగా ఓ ఆటో డ్రైవర్‌ ఇంటి వద్ద దిగబెడతాననడంతో అతడి ఆటో ఎక్కింది. అనంతరం అతడు మరో ఇద్దరిని స్నేహితులని చెప్పి..  ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటోను పురానాపూల్‌ వైపు కాకుండా హిమాయత్‌సాగర్‌ వైపు తీసుకెళ్లి ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆపి.. ముగ్గురూ మహిళపై అత్యాచారం చేసి పరారయ్యారు. బాధితురాలు కోలుకొని రోడ్డుపైకి రావడంతో స్థానికులు రాజేంద్రనగర్‌ ఠాణాకు చేర్చారు. పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన