అడ్డంగా నరికేస్తున్నారు!
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

అడ్డంగా నరికేస్తున్నారు!

పర్యావరణ పరిరక్షణ ధ్యేయమంటూ అధికారులు ఘనంగా ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వృక్షాలు అడ్డంగా నరికేస్తున్నా చోద్యం చేస్తున్నారు. తమ ఇళ్లకు అడ్డుగా ఉన్నాయని, నరసరావుపేట పట్టణంలో రాత్రికి రాత్రి భారీ వృక్షాలను నేల కూలుస్తున్నారు. పట్టణ పరిధిలోని అరండల్‌పేటలో ఓ వైద్యుడొకరు భవనానికి అడ్డుగా ఉందని, ప్రజలకు నీడ ఇస్తున్న చెట్టును మొదళ్ల వరకు నరికించాడు. రాత్రికి రాత్రి రెండు చెట్లు నేలకూలాయి. రామిరెడ్డిపేటలోని పాత తపాలా కార్యాలయం వీధిలో తమ కట్టడానికి అడ్డుగా ఉందని యజమాని చెట్టు కొమ్మలు నరికించాడు. ప్రకాష్‌నగర్‌లోని షాదీఖానా ప్రాంగణంలో ఎన్నో సంవత్సరాలుగా నీడనిస్తున్న చెట్లను ఎలాంటి కారణం లేకుండా నరికేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చుతున్న పురపాలక అధికారులు పట్టించుకోవడం లేదు. - నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని