Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

54 కేంద్రాల్లో టీకా మహోత్సవం

విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌లో వ్యాక్సిన్‌ కోసం బారులు

ఈనాడు- విజయవాడ, న్యూస్‌టుడే-గన్నవరం గ్రామీణం: కృష్ణా జిల్లాలో టీకా ఉత్సవం ఆదివారం పెద్దఎత్తున జరిగింది. ఉదయం 10 గంటల నుంచి వైద్య కేంద్రాలు, సచివాలయాలు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల వద్దకు జనం చేరుకున్నారు. చాలాచోట్ల ఉదయం 11.30 వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆరంభం కాలేదు. దీంతో టీకా కేంద్రాల వద్ద చాలా సమయం వేచి ఉండి.. ఎక్కువ మంది ఇళ్లకు వెళ్లిపోయారు. స్టోర్‌ నుంచి ఆయా కేంద్రాలకు తరలించడంలో ఇబ్బందులు ఏర్పడడంతో కొన్నిచోట్ల తీవ్ర జాప్యం జరిగింది. ఈనెల 14వరకు రోజుకు 50వేల మందికి చొప్పున నాలుగు రోజుల్లో రెండు లక్షల మందికి టీకాలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. కానీ.. తొలిరోజు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయారు.

తొలి విడతలో జిల్లాకు వచ్చి ప్రస్తుతం మిగిలి ఉన్న వ్యాక్సిన్‌ మొత్తాన్ని త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పెద్దఎత్తున టీకాలను వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. శనివారం కూడా జిల్లాలో 21వేల మందికి వేశారు. ఆదివారం 54 సెషన్స్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు చాలా కేంద్రాల్లో కొనసాగింది. రాత్రి 7 గంటల సమయానికే 20వేల మందికి పైగా టీకా వేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. విజయవాడలోని రైల్వేస్టేషన్‌, బస్టేషన్‌ సహా అనేక కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని