‘మా ఎన్నికల్లో గెలుపోటముల రహస్యం దుర్గమ్మకే తెలియాలి’
eenadu telugu news
Updated : 15/10/2021 08:12 IST

‘మా ఎన్నికల్లో గెలుపోటముల రహస్యం దుర్గమ్మకే తెలియాలి’

మాట్లాడుతున్న నటి హేమ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో మొదట గెలిచానని, తరువాత ఓడిపోయారని ప్రకటించడం వెనక రహస్యం ఎంటో దుర్గమ్మకే తెలియాలని నటి హేమ అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మహిసాసురమర్థిని అలంకారంలో ఉన్న దుర్గమ్మను ఆమె గురువారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సిబ్బంది దర్శనం చేయించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ ఆమెకు శేషవస్త్రంతోపాటు చీరను అందజేశారు. దీంతో హేమ ఉబ్బితబ్బిబ్బయ్యారు. గర్భగుడిలో అమ్మవారి చీర నాకు ప్రసాదిస్తే బాగుంటుందని మనసులో అనుకున్నానని, బయటకు వచ్చిన తరువాత దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శితో పరిచయం లేకపోయినా అమ్మవారి చీరను ఇవ్వడం జగన్మాతకు భక్తుల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. దసరా ఉత్సవాల్లో దర్శనానికి వచ్చినప్పుడల్లా దశాబ్దకాలం పాటు చీరను అమ్మవారికి ఇచ్చానని చెప్పారు. ఈ సారి దర్శనానికి ఎన్నికల కారణంగా రాలేనని అనుకున్నా, అమ్మ రప్పించి చీర ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని