29న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు రాష్ట్ర జట్ల ఎంపిక
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

29న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు రాష్ట్ర జట్ల ఎంపిక

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: హరియాణాలో 2021లో జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ (అండర్‌-18) బాలబాలికల పోటీల్లో పాల్గొనే రాష్ట్ర కబడ్డీ (బాలబాలికలు), ఖోఖో (బాలుర), హ్యాండ్‌బాల్‌ (బాలికల)జట్ల ఎంపికలు ఈ నెల 29వ తేదీన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తామని శాప్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. కబడ్డీ ఎంపికలు (బాలురు 70 కేజీల్లోపు, బాలికలు 65 కేజీల్లోపు ఉన్నవారు) గుంటూరులోని బీఆర్‌ స్టేడియంలో, ఖోఖో జట్టు ఎంపికలు ప్రకాశం జిల్లా జె.పంగులూరులో, హ్యాండ్‌బాల్‌ బాలికల జట్టు ఎంపికలు విజయవాడ ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. జనవరి ఒకటి, 2003 తర్వాత పుట్టిన వారు ఎంపిక పోటీలకు అర్హులన్నారు. ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువపత్రంతో సంబంధిత ప్రాంతాల్లో 29న ఉదయం 9 గంటల్లోపు హాజరవ్వాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని