Published : 27/07/2021 06:01 IST

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా

 

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామాలు, పట్టణాల్లో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు సూచించారు. సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, మహిళా పోలీసులు, మహిళా మిత్ర కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో మహిళలు, బాలికలకు సంబంధించిన నేరాలు, నాటు సారా తయారీ, అక్రమ మద్యం విక్రయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు: అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. సీజ్‌ చేసిన వాహనాలను దుర్వినియోగం చేయకూడదని సూచించారు. అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఐడీ, క్రైం బృందాలను రద్దు చేసినట్లు తెలిపారు. అదనపు ఎస్పీ (పరిపాలన) కరణం కుమార్‌, డీఎస్పీ అంబికా ప్రసాద్‌ తదతరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని