వైద్య, ఆరోగ్యశాఖలో మళ్లీ డిప్యుటేషన్లు
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

వైద్య, ఆరోగ్యశాఖలో మళ్లీ డిప్యుటేషన్లు

కాకినాడ వైద్యం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులకు మళ్లీ డిప్యుటేషన్లు కల్పిస్తూ కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ అత్యవసర సేవల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ విభాగాల్లోని సుమారు 50 మందికి మూడు నెలల డిప్యుటేషన్‌ కొనసాగించారు. నెల కిందట డిప్యుటేషన్లు రద్దు చేయగా136 మంది సొంత స్థానాలకు వెళ్లారు. అప్పటి వరకు 120 మంది డీఎంహెచ్‌వో కార్యాలయంలోనూ మిగతా 16 మంది పీహెచ్‌సీల్లో ఉన్నారు. వీరిని సొంత స్థలాలకు పంపారు. కొవిడ్‌ సేవల నిమిత్తం మళ్లీ డిప్యుటేషన్లకు వీలు కల్పించారు. తొలిగా50 మందిని డీఎంహెచ్‌వో కార్యాలయం పరిధిలో నియమించారు. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న వారిలో 90 శాతం మంది శాశ్వత ఉద్యోగులే. వీరంతా జిల్లా కేంద్రంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో మరింత మందిని డిప్యుటేషన్లపై డీఎంహెచ్‌వో కార్యాలయానికి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌ సేవలకు ఎంత మంది అవసరం, వీరి విధులేంటి, ఇలా అన్ని అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సి ఉంది. డిప్యుటేషన్ల సాకుతో కొంతమంది జిల్లా కేంద్రానికి రావడానికి పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని