ఉపాధి వేతన భాగ్యం ఎప్పుడో..?
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

ఉపాధి వేతన భాగ్యం ఎప్పుడో..?

రావులపాలెం గ్రామీణం: ఉపాధిహామీ పథకం వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారు. వారం రోజులు పనిచేస్తే మూడు రోజుల్లో వేతనాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం నెలలు తరబడి ఎదురుచూస్తున్నా వేతనాలు అందక అప్పులు చేసి కుటుంబాలు పోషించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. రెండు నెలల నుంచి వేతనాలు సక్రమంగా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో 62 మండలాల్లో 1,069 పంచాయతీల్లో 7,32,888 జాబ్‌కార్డులు ఉన్నాయి. 8,59,954 మంది వేతనదారులు ఉన్నారు. వీరికి 48,554 శ్రమశక్తి సంఘాల ద్వారా పనులు కల్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.68 కోట్ల పనిదినాలు కల్పించారు. ఈ ఏడాది పనిచేసిన కూలీలకు ఇప్పటి వరకు రూ. 387 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇంకా రూ.49 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆత్రేయపురం మండలంలో రూ.61 లక్షలు, కొత్తపేటలో రూ.39, రావులపాలెం మండలంలో రూ.51, మలికిపురం మండలంలో రూ.1.03, రాజోలు మండలంలో రూ.73 లక్షలు చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని