సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం

సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ

బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబుకు 61 మంది ఫిర్యాదులు అందజేశారు. వీటిలో సివిల్‌ వివాదాలకు సంబంధించి 30, కుటుంబ తగాదాలు 9, ఇతర సమస్యలపై 22 ఫిర్యాదులు ఉన్నాయి. ఎస్పీ వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడి నుంచే సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌లతో వీడియోకాన్ఫరెన్స్‌ వ్యవస్థ ద్వారా సమీక్షించారు. ఫిర్యాదులపై సత్వరమే విచారణ పూర్తిచేసి పరిష్కరించాలని సూచించారు. గత సోమవారం నిర్వహించిన స్పందనకు 64 ఫిర్యాదులు రాగా, వీటిలో 50 పరిష్కరించినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని