ఎన్‌ఆర్‌ఏఐ మేనేజింగ్‌ కమిటీలో హైదరాబాదీకి స్థానం
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

ఎన్‌ఆర్‌ఏఐ మేనేజింగ్‌ కమిటీలో హైదరాబాదీకి స్థానం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) మేనేజింగ్‌ కమిటీకి జూబ్లీహిల్స్‌కు చెందిన షాబ్‌ మొహమూద్‌ ఎన్నికయ్యారు. జూబ్లీహిల్స్‌లో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. దిల్లీలో ఆదివారం నిర్వహించిన సంస్థ 29వ వార్షిక సమావేశంలో 2021-23 సంవత్సరానికి తాను ఎన్నికైనట్లు తెలిపారు. భారతీయ ఆహార సేవా రంగాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తానని, హైదరాబాదీ వంటకాలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడంతో పాటు నగరానికి వివిధ కొత్త రుచులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని