రైతుల సమస్యలు తీర్చడంలో నిర్లక్ష్యమా?: విశ్వేశ్వర్‌రెడ్డి
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

రైతుల సమస్యలు తీర్చడంలో నిర్లక్ష్యమా?: విశ్వేశ్వర్‌రెడ్డి

చిగురాల్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రమాదకరమైన వాగులను దాటుతూ అవస్థలు పడుతున్న పరిగి మండల చిగురాల్‌పల్లి గ్రామ రైతుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించి ఇటీవలే రైతులు వాగులపై నిర్మించుకున్న వెదురు వంతెనలను, పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ప్రాణాలను పణంగా పెట్టి పొంగుతున్న వాగులను దాటి పొలాలకు వెళ్తున్న రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కరించక పోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి హన్మంతు, మండల పార్టీ అధ్యక్షుడు పరశురాంరెడ్డి ఉన్నారు.

బాధిత కుంటుంబానికి పరామర్శ
పూడూరు: తిమ్మపూర్‌లో అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు యాదయ్య, యాదమ్మ కుటుంబాన్ని మంగళవారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.50 వేలు నగదును అందజేయడంతో పాటు వారి పిల్లలపై చదువుల బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచి రామస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్‌ ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని