జిల్లా సమాచారం పుస్తకంలో నిక్షిప్తం: కలెక్టర్‌
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

జిల్లా సమాచారం పుస్తకంలో నిక్షిప్తం: కలెక్టర్‌

గణాంకాల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పాలనాధికారిణి నిఖిల

వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లా ప్రణాళికాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ముద్రించిన సమగ్ర గణాంకాల పుస్తకంలో జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారం పొందుపర్చారని పాలనాధికారిణి నిఖిల అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో గణాంకాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని అన్ని వివరాలతో ముద్రించారని తెలిపారు. ఇది అధికారులకు, జిల్లా సమాచారం అవసరం ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పుస్తకం వెంట ఉంటే జిల్లా సమాచారం అంతా చేతిలో ఉన్నట్లేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ కృష్ణన్‌, ముఖ్య ప్రణాళికాధికారి నిరంజన్‌, ఉప ప్రణాళికాధికారి రఘురాం పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని