HYD: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రూ.55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌
eenadu telugu news
Updated : 26/09/2021 06:56 IST

HYD: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రూ.55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కారు చోదకుడు రూ.55 లక్షలతో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10సి ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి వద్ద ఆరు నెలల కిందట కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన శ్రీనివాస్‌ డ్రైవర్‌గా చేరాడు. బోరబండలో ఉంటున్నాడు. కోకాపేటలో ఉంటున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి రూ.55లక్షలు ఇచ్చి రమ్మని సంతోష్‌రెడ్డి డ్రైవర్‌కు సూచించాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస్‌ కారులో నగదు తీసుకొని బయలుదేరాడు. సాయంత్రం 4 గంటలు దాటినా కోకాపేట చేరుకోలేదు. ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో అనుమానించిన సంతోష్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కారుని దొడ్ల భవనం వద్ద గుర్తించారు. అన్ని పోలీస్‌స్టేషన్‌న్లకు సమాచారం ఇచ్చి  సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని