విస్తృత సమావేశం.. అమాత్య సందేశం
eenadu telugu news
Published : 28/10/2021 05:32 IST

విస్తృత సమావేశం.. అమాత్య సందేశం

నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో బుధవారం తెరాస విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా వేర్వేరు సమావేశాలకు హాజరైన మంత్రులు చేసిన వ్యాఖ్యలివి


దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో తెరాస నంబర్‌ వన్‌. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇతర పార్ట్టీలు తట్టుకుని నిలబడలేని పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు కోపంలో ఏదైనా అంటే ఓపికతో వినాలని అప్పుడే నాయకుడిగా గుర్తింపు లభిస్తుంది.

- మేడ్చల్‌ నియోజకవర్గం అలియాబాద్‌ చౌరస్తాలో జరిగిన  సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి


దేశ ద్రోహులకు మరణ శిక్ష విధించాలి. పార్టీ ద్రోహులను ఓడించాలి. ఈ సభావేదిక ద్వారా హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తున్నా. తెరాస ద్రోహి ఈటలను చిత్తుగా ఓడించాలి. తెరాస అభివృద్ధి కోసం ఏర్పడిందే తప్ప వ్యక్తుల కోసం కాదు.

-ఆజంపురా ఆజం ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ


తెలంగాణలో మొత్తం 9.22లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా జనాభాతో పోలిస్తే అధిక ఉద్యోగ శాతం ఉన్నది ఇక్కడే. రాష్ట్రంలో కాంగ్రెస్‌, భాజపాలు అధికారం కోసం ఎన్ని కలలు కన్నా అవి కలగానే మిగులుతాయి. దేశంలో మొత్తం 30లక్షల ఉద్యోగాలుంటే ప్రస్తుతం 8లక్షలు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయం రాష్ట్ర భాజపా నాయకులకు తెలియదా.? ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న కేంద్రం దేశంలో నిరుద్యోగాన్ని ఇంకా పెంచుతోంది.

- ఇబ్రహీంపట్నం మన్నెగూడలో జరిగిన సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


నమ్మకానికి మారు పేరు తెరాస. అమ్మకానికి మారు పేరు భాజపా. గ్యాస్‌, డీజిల్‌ ధరలను నియంత్రించే శక్తి కేంద్రం చేతిలో ఉంటుంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలే భాజపాకు బుద్ధి చెబుతారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నీటి కష్టాలు లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేసి సాగు, తాగుకు కొరత రానివ్వట్లేదు.

- మహేశ్వరం బడంగ్‌పేటలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని