పకడ్బందీగా మొక్కల సంరక్షణ
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

పకడ్బందీగా మొక్కల సంరక్షణ

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న వేదిక నాయకులు

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పాలనాధికారిణి డాక్టర్‌ సర్వే సంగీతసత్యనారాయణ తెలిపారు. బుధవారం పాలనాప్రాంగణంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి లక్ష్యాలు చేరుకునేందుకు ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్లతో నీరు పట్టాలన్నారు. అవెన్యూ, బ్లాక్‌ ప్లాంటేషన్‌ పనుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతివనాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామీలో కూలీలకు మెరుగైన కూలీ కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు పాలనాధికారి(స్థానిక సంస్థలు) కుమార్‌దీపక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని