Updated : 22/01/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నెలలోపు పనులు పూర్తి చేయాలి

ఆదోని మార్కెట్: పట్టణ శివారులోని బసాపురం ఎస్ఎస్‌ ట్యాంకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గత ఏడాది అధిక వర్షాల కారణంగా 100 మీటర్ల పొడవు ఉన్న ఈ ట్యాంకు కట్ట దెబ్బతింది. దీంతో రూ.1.80 కోట్ల నిధులతో కట్ట నిర్మాణ పనులు చేపట్టామని ఆయన చెప్పారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి, తుంగభద్ర దిగువ కాలువ నీటితో ఎస్ఎస్‌ ట్యాంకును నింపుకోవాలన్నారు. దీని వల్ల రానున్న వేసవికి నీటి కష్టాల నుంచి గట్టెక్కుతామని, లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈయన వెంట పురపాలక కమిషనర్‌ కృష్ణ, మున్సిపల్ ఇంజినీర్‌ సత్యనారాయణ, ఏఈ రాజశేఖర్‌ రెడ్డి, వైకాపా నాయకులు చంద్రకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి, తిమ్మప్ప, దేవా, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని