Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గొలుసు దొంగల హల్‌చల్‌

ఆదిత్య నగర్‌ (కర్నూలు నేరవిభాగం), న్యూస్‌టుడే : కృష్ణానగర్‌ సమీపంలోని ఆదిత్య నగర్‌లో శనివారం గొలుసు దొంగలు హల్‌చల్‌ చేశారు. అదే కాలనీలో ఉంటున్న బసప్ప భార్య యశోద బిర్లా కాంపౌండ్‌లో కోచింగ్‌ సెంటర్‌లో ఉన్న కుమార్తెను కలిసి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు దుండగులు బైకుపై ఆమెను సమీపించి మెడలోని బంగారు గొలుసును తెంపుకొని ఉడాయించారు. బాధితురాలు గట్టిగా కేకలేసేసరికే వారు కనపడలేదు. గొలుసు రెండు తులాలు ఉన్నట్లు తెలిసింది. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు బాధితురాలిని విచారించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
ఓర్వకల్లు, న్యూస్‌టుడే : చెన్నంశెట్టిపల్లెకు చెందిన ఓ వ్యక్తిని కారు ఢీకొనటంతో తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. చెన్నంశెట్టిపల్లెకు చెందిన వీరభద్రుడు ద్విచక్ర వాహనంపై సోమయాజులపల్లెకు వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. గ్రామ సమీపంలో నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళుతున్న కారు వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొనటంతో వీరభద్రుడు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని