నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
logo
Published : 18/06/2021 02:58 IST

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

మునుగోడు, న్యూస్‌టుడే: నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏవో శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. పత్తి విత్తనాలు నకిలీ వస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని రైతులను కోరారు. దుకాణాల నుంచి రశీదులు తప్పనిసరిగా పొందాలని సూచించారు.  ప్రభుత్వం గుర్తించిన పత్తి విత్తనాలను అమ్మకాలను జరపాలని దుకాణాదారులకు సూచించారు. దుకాణాలలో ఉన్న బిల్లులతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. ఏవో శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని