తడిసిమోపెడవుతున్న కష్టాలు
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

తడిసిమోపెడవుతున్న కష్టాలు

రెంజల్‌-బోధన్‌ రహదారిపై తడిసిన వడ్లు

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాను వరుణుడు వీడడం లేదు. పంట కోత దశలో కురుస్తున్న వానలతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే సగం మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో పైరు అతలాకుతలం అవుతోంది. వందలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. రోడ్లపైనే ఆరబోసిన ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. మగ్గిడిలో 86.3, మాక్లూర్‌లో 79.8, చిన్నమావందిలో 70.8, బెల్లాల్‌లో 66.8, మచ్చర్లలో 66.3, కమ్మర్‌పల్లిలో 62.3, రెంజల్‌లో 60.3, నిజామాబాద్‌ రూరల్‌లో 57.8, ఏర్గట్లలో 54.5, ఆలూర్‌లో 52.5, మోస్రాలో 45.8, ఆర్మూర్‌లో 45.5, ముప్కాల్‌లో 41.3, మెండోరాలో 40.3, వేంపల్లిలో 38.8, మంచిప్పలో 38.8, సాలూరాలో 36.3, ఎడపల్లిలో 38.3, చందూర్‌లో 37.0, నందిపేట్‌లో 34.8, మోర్తాడ్‌లో 34.3, భీమ్‌గల్‌లో 33.3, కోటగిరిలో 32.5, బాల్కొండలో 33.2 మి.మీ వర్షం పడింది. ఉపరితల ద్రోణి తీవ్రత తగ్గినప్పటికీ రెండ్రోజుల వరకు దాని ప్రభావం జిల్లాపై ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని