బీసీల పక్షపాతి సీఎం
eenadu telugu news
Published : 27/07/2021 03:21 IST

బీసీల పక్షపాతి సీఎం

మాట్లాడుతున్న మామిడి శ్రీకాంత్‌, చిత్రంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు

అరసవల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీసీల పక్షపాతి అని, వారి అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నారని తూర్పుకాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, కళింగ కోమటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అంధవరపు సూరిబాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ బీసీల అభ్యన్నతే ధ్యేయంగా ముందుకు సాగుతూ, అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని కొనియాడారు. ఏలూరులో భారీ మెజార్టీతో వైకాపా గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ఛైర్మన్లు ఎందుకని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని, వారి హయంలో ఎంతమందికి ఆ పదవులు ఇచ్చారో చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్‌ ఛైర్మన్‌లు పేరాడ తిలక్‌, సల్లా సుగుణ, కరమి రాజేశ్వరరావు, కోరాడ ఆశలత, హేమమాలినిరెడ్డి, నర్తు రామారావు, శ్యాం ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని