విజేతలు వీరే..!
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

విజేతలు వీరే..!

నాలుగు నియోజకవర్గాల్లో ఎంపీటీసీల ఫలితాలు విడుదల

పలాస కాశీబుగ్గ: పలాస మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా 9 స్థానాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వైకాపా నుంచి ఉంగ ప్రవీణ (టెక్కలిపట్నం), సవర దాలమ్మ (రెంటికోట), తుంగాన రమణమ్మ (బ్రాహ్మణతర్లా), కోరాడ నిరూష (మాకన్నపల్లి), గొకల మనీష (గురుదాసుపురం), తలగాన శ్రీరాములు (పెదంచల), మద్దిల పాపారావు (బొడ్డపాడు), కనగల షన్ముఖరావు (కేదారిపురం), గొండు మోహనరావు (లక్ష్మిపురం), స్వతంత్ర అభ్యర్థిగా బమ్మిడి దుర్వోధన (చినంచల) ఎన్నికయ్యారు.
వజ్రపుకొత్తూరు మండలం: వజ్రపుకొత్తూరు: మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు 3 ఏకగ్రీవంగా కాగా.. 18 స్థానాలకు ఎన్నికల జరిగాయి. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో వైకాపా నుంచి మడ్డు పరమేశ్వరి (అక్కుపల్లి), కొయిరి భాగ్యలక్ష్మీ (చినవంక), ఉప్పరపల్లి నీలవేణి (బాతుపురం), తమ్మినాని శ్రావణి (బెండి), కొండప్ప సుందరమ్మ (మెట్టూరు), తిర్రి గుణ (చీపురుపల్లి), పిట్ట సుగుణ (రాజాం), బమ్మిడి రాజేశ్వరి (వజ్రపుకొత్తూరు), వంక రాజు (మంచినీళ్లుపేట), ఉప్పాడ ఉపేంద్రరావు (పల్లీవూరు), కారి నీలవేణి (పూడిజగన్నాథపురం), కర్ని వరలక్ష్మీ (గోవిందపురం), దున్న ఆరుద్రమ్మ (అమలపాడు), బాలక శ్రీను (పాతటెక్కలి), గుంటు మాకయ్య (సైనూరు), ఉరిటి దమయంతి (అనంతగిరి), తెదేపా నుంచి సూళ్ల చిట్టిబాబు (రెయ్యపాడు) గొరకల మహలక్ష్మీ (పెద్దమురారిపురం)
మందస మండలం: మండలంలో 24కు గాను 23 మండల ప్రాదేశికాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరిగింది. రాంపురం, జిల్లుండ, అంబుగాం, సరియాపల్లి ప్రాదేశికాల నుంచి వైకాపా అభ్యర్థులకు మెజారిటీ ఓట్లు వచ్చినా ఈ నాలుగు ప్రాదేశికాలకు సంబంధించి 139 బ్యాలెట్లు చెదలు పట్టి పాడవడంతో ఫలితాలను రాత్రి వరకు పెండింగులో ఉంచారు.    
విజేతలు వైకాపా నుంచి.. కొర్నాన ఆదినారాయణ (బాలిగాం), దడ్డ దమయంతి (మూలిపాడు), దువ్వు గౌరమ్మ (మందస-1), కంచి బెహర (మందస-2), మెట్ట రుక్మిణి (మందస-3), మట్ట లక్ష్మమ్మ (బైరిసారంగపురం), ఆనల అప్పన్న (హరిపురం), కర్రి తిరుమల (కొత్తపల్లి), సవర హరినారాయణ (కొంకడాపుట్టి), సవర ఢిల్లేశ్వరి (కొండలోగాం), కొరికాన సుమలత (లొహరిబంద), తెప్పల ఉమాపతి (దున్నూరు), సవర కాంచన (సాబకోట), గొరకల పార్వతి (నారాయణపురం), సుశీల మల్లికో (బెల్లుపటియా), రమేష్‌ పాణిగ్రహి (పొత్తంగి), నల్ల అనిత చౌదరి (తాళ్లగురంటి), శీర లోకనాధం (బుడార్శింగి),     స్వతంత్ర అభ్యర్థిగా సూరాడ వాసు(బేతాళపురం) విజయం సాధించారు.


పాతపట్నం

ఎంపీపీ రేసులో ఉన్న తూలుగు మేనకకు ఎంపీటీసీగా ఎన్నికైనట్లు అధికారిక పత్రం ఇస్తున్న అధికారులు

నియోజకవర్గంలో వైకాపాకు మంచి ప్రాధాన్యత లభించింది. తెదేపా పార్టీ నుంచి పోటీ లేకపోవడంతో వైకాపా అభ్యర్థుల మెజార్టీ అధికంగా కనిపించింది.
మెళియాపుట్టిలో 13 వైకాపా.. 2 తెదేపా : మెళియాపుట్టి మండలంలో 15 మండల ప్రాదేశకాలలో 13 స్థానాల్లో వైకాపా విజయం సాధించగా.. 2 స్థానాలు తెదపా కైవసం చేసుకుంది. వైకాపా విజేతలు : సలాన జనార్థనరావు (కొసమల),  పోలాకి జయంతి(మెళియాపుట్టి), శ్రీరాం మిని(చాపర), రానాఈశ్వరి ( పెద్దలక్ష్మిపురం), కొల్లాన ఇందిరాదేవి(గొప్పిలి), సవర రవికుమార్‌ (భరణికోట), దాసరి రవికుమార్‌ (కరజాడ), సవర ఆదినాయుడు (పరుశురాంపురం), నక్క కాత్యాణి (మర్రిపాడు-సీ), సయాకు సరోజని(వెంకటాపురం), జెన్ని శాంతి (కేరాసింగి), ఉర్లాన హంసమ్మ (పెద్దపద్మాపురం), పాడి ధనలక్ష్మి (రట్టిని)
తెదేపా విజేతలు : కదంబాల సుజాత(జాడుపల్లి), నంబాళ్ల పద్మావతి (పట్టుపురం)
ఎల్‌ఎన్‌పేటలో  వైకాపా 8..తెదేపా 2: : ఎల్‌ఎన్‌పేట మండలంలో 10 ప్రాదేశక ఎన్నికల్లో ఎనిమిది మంది వైకాపా అభ్యర్థులు, ఇద్దరు తెదేపా అభ్యర్థులు గెలుపొందారు.
వైకాపా నుంచి : రెడ్డి జ్యోతిలక్ష్మీ (మోదుగువలస ఆర్‌ఆర్‌ కాలనీ), శివ్వాల ఇందుమ్మ (బొత్తాడసింగి), కింతలి చిరంజీవులు(బొర్రంపేట), తలసముద్రం కుమారి (కరకవలస) , పల్లి జయలక్ష్మీ (టి.కృష్ణాపురం),  కొల్ల స్వర్ణలత (చింతలబడవంజ), లోచెర్ల లక్ష్మీ (మిరియాప్పల్లి), మూకళ్ల తులసమ (పెద్దకొల్లివలస).  తెదేపా విజేతలు :  ముద్దాడ ప్రియదర్శిని(ఎంబారం), శిమ్మ మోహనరావు (ఎల్‌ఎన్‌పేట).
పాతపట్నంలో 16కు 16..: పాతపట్నం మండలంలో మొత్తం 18 ప్రాదేశిక స్థానాలు ఉన్నాయి. ఇందులో పాతపట్నం - 1 సవిరిగాన ప్రదీప్‌, పాతపట్నం -4 ఆమిటి బాబూరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో 16 మందికి ఎన్నిక జరిగింది. 16 స్థానాలకుగాను 16 స్థానాలు వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. చందక సరస్వతి (సవరసిద్దమనుగు), సునిత అపటో (బూరగాం), కొప్పల గీత (తిడ్డిమి), మడ్డు సుగుణకుమారి (కొరసవాడ), అపర్న రెడ్డి (శోభ), నడిమింటి అర్జునరావు (రొమదళ), గంగు శోభారాణి (పాసిగంగుపేట), పడాల విజయ (తామర), అమర ఉషారాణి (కాగువాడ), దువ్వారి జోగారావు (పెద్దలోగిడి), కొండాల ఎరకయ్య (పాతపట్నం-2), పోలాకి రేణుక (పాతపట్నం-3), దొర సావిత్రమ్మ (గంగువాడ), నాయుడు భాగ్యవతి (బడ్డుమర్రి), కూన సరోజిని (తెంబూరు), పడాల లక్ష్మణరావు (చంగుడి).
హిరమండలంలో వైకాపా 5, తెదేపా 3: హిరమండలం మండలంలో ఎన్నికలు నిర్వహించిన 9 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 గురు వైకాపా అభ్యర్ధులు, ముగ్గురు తెదేపా అభ్యర్ధులు విజయం సాధించారు. వైకాపా విజేతలు : తూలుగు మేనక (తంప), కరణం ప్రియాంక(రుగడ), తట్ల శంకరరావు (హిరమండలం-2), వెలమల బాలరాజు (హిరమండలం-1),  లుకలాపు సావిత్రి(అంబావల్లి), వంగపల్ల సావత్రి (చొర్లంగి)  
తెదేపా : చింతాడ బుడ్డు( హిరమండలం-4), బెవర గంగాధర్‌ (కొండరాగోలు), అగదల గురవమ్మ (ఎంఎల్‌పురం),
కొత్తూరులో వైకాపా 14..తెదేపా 5: కొత్తూరు మండలంలో 20 ప్రాదేశక ఎన్నికల్లో 14 మంది వైకాపా అభ్యర్థులు, నలుగురు తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. దిమిలి ఎంపీటీసీకి పోలింగ్‌ జరగలేదు. వైకాపా విజేతలు : అగతముడి సుశీల(కుంటిబద్ర), లోతుగడ్డ తులసీవరప్రసాద్‌(కొత్తూరు-1), సవర సుశీక(గొట్టిపల్లి), వనుము లక్ష్మీనారాయణ(పారాపురం), చింతాడ శ్రావణి(ఇరపాడు) వడ్డి గౌరీకుమార్‌(కర్లెమ్మ), గండెవలస రత్నకుమారి(కొత్తూరు-2), బిల్లంగి కృష్ణవేణి(నివగాం), బోర కమల(నేరడి), సరిపల్లి ప్రసాదరావు(బలద), మెండ సుమతి(మదనాపురం), చేకాటి వీర్రాజు(మాకవరం), పొడ్డిన సింహాలచం(మెట్టూరు బిట్‌-1 ఆర్‌ఆర్‌కాలనీ), సవర సావిత్రి(లబ్బ).
తెదేపా: వలురోతు గోవిందరావు(కడుమ), టొంపల నాగమణి(కొత్తూరు-3), అగతముడి భైరాగినాయుడు(గురండి), చంగల దివ్య(బమ్మిడి),కలమట ఇందిర (మాతల)

 


ఇచ్ఛాపురం

కవిటి: విజేతలతో ఆనందం వ్యక్తం చేస్తున్న జడ్పీటీసీ అభ్యర్థి పిరియా విజయ, సాయిరాజ్‌ తదితరులు

ఇచ్ఛాపురం: బ్యాలెట్‌పేపర్లు కట్టలు కట్టడంలో కాస్త జాప్యం కావడంతో నియోజకవర్గంలో ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఇచ్ఛాపురంలో: 13 స్థానాలకు పోటీ సాగింది. వైకాపా నుంచి.. నర్తు శాంతికుమారి (ఈదుపురం1) , దువ్వు వివేకానందరెడ్డి (ఈదుపురం2), నీలాపు జగదీశ్‌ (కేదారిపురం), మాసుపత్రి చక్రవర్తి (కేశుపురం), మరడ కుమారి (తులసిగాం), పిట్ట శారద (ధర్మపురం), దున్న గురుమూర్తి (బూర్జపాడు), పిట్ట హేమలత (లొద్దపుట్టి1), ఆశి మందాకిని (లొద్దపుట్టి2) ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి.. మాజీ ఎంపీపీ దక్కత ఏకాంబరిదేవి (బిర్లంగి), కాళ్ల గోపాలరావు (మండపల్లి2), లక్ష్మీ బెహర (మండపల్లి1), మేరుగు సీత (తేలుకుంచి) ఎన్నికయ్యారు.
సోంపేట మండలంలో..: సోంపేట: సోంపేట మండలంలో 23 మండల ప్రాదేశికాలకు వైకాపా 21, తెదేపా రెండు చోట్ల విజయం సాధించారు. వైకాపా నుంచి పొడుగు కామేషు(సోంపేట-1), వైశ్యరాజు నీత(సోంపేట-2), నర్తు జానకి (సోంపేట-3) రేగు ప్రేమ(సోంపేట-4), బొమ్మిడి ధర్మరాజు(సోంపేట-5), నిమ్మన దాసు(జింకిభద్ర), బైపల్లి కామమ్మ(ఇసకలపాలెం), మడ్డు.ఈశ్వరరావు(గొల్లగండి),గుర్రాల శ్రీను (బారువ-1), తామాడ పద్మావతి (బారువ-2), మద్ది సునీత(బారువ-3), పొలాకి రమణమూర్తి (పలాసపురం), వాసెట్టి సుజాత (బేసిరామచంద్రపురం), నిమ్మన లీలారాణి (సుంకిడి), ఎ.నాగేశ్వరరావు(పొత్రఖండ), దుమ్ము రూపవతి (పాలవలస) మంగి గణపతి(కర్తలిపాలెం),పిన్నింటి ఝాన్సీ (గొల్లూరు),పుక్కళ్ల సరోజిని(తాళభద్ర), దున్న మాధవరావు(మామిడిపల్లి), మైలపల్లి నరేంద్ర (ఉప్పలాం), తెదేపా నుంచి రాంబుడ్డి లైలావతి(కొర్లాం), కొరికాన ఆనందరావు (మాకన్నపురం) విజయం సాధించారు.
కవిటి మండలంలో : కవిటి గ్రామీణం: మండలంలో 21 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 20 చోట్ల వైకాపా, ఒకచోట తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. వైకాపా నుంచి సత్యవతిసాహు (మాణిక్యపురం), బి.ఝాన్సీరాణి (కరాపాడు) పి.నీలాచలం (కవిటి-1) ఎ.హేమలత (కవిటి-2) ఎం.శంకర్‌ప్రధాన్‌ (కవిటి-3) టి.పార్వతి (కపాసుకుద్ది) కె.పద్మావతి (కుసుంపురం) యు.నీల (కొజ్జిరియా) కె.పద్మ (గొర్లెపాడు) పి.నేతాజి (జగతి) డి.దూదమ్మ (నెలవంక) మనోహర్‌ దళాయి (బల్లిపుట్టుగ) కె.గోపయ్య (బెజ్జిపుట్టుగ), డి.సతీష్‌ (బొరివంక-1) ఇ.రామయ్య (బొరివంక-2) ఎస్‌.కృష్ణారావు (రాజపురం-1) పి.జగదీశ్వరి (రాజపురం-2) టి.పారమ్మ (లండారిపుట్టుగ) పి.కృష్ణారావు (వరక) బి.దమయంతి (సహలాలపుట్టుగ), తెదేపా నుంచి ఆర్‌.రూపవతి (బెలగాం) విజయం సాధించారు.
కంచిలి మండలంలో..: కంచిలి: కంచిలి మండలంలో వైకాపా నుంచి.. పొందూరు మాధవి(అంపురం), గన్ని లక్ష్మీబాయి(భైరిపురం), భగవాన్‌ ప్రధాన్‌(ముండ్లా), మల్లపురెడ్డి పద్మావతి(పోలేరు), బుడ్డెపు విశ్వనాథం(ఎం.ఎస్‌.పల్లి),  ఎలుసూరు బాబావతి(మఖరాంపురం), బొండాడ వైకుంఠరావు(బొగాబెణి), భాగ్యవతి పండా(జలంత్రకోట), పైల దేవదాసురెడ్డి(కొల్లురు), మెండ హేమావతి(కేసరపడ), పాలిన కామాక్షి(కంచిలి-2), దుర్గాశి మాదవరావు(గోకర్ణపురం), నీలావతి దొళాయి(కొక్కిలిపుట్టుగ), మడ్డు డిల్లమ్మ(బూరగాం), జామి జయ(జాడుపూడి),   తెదేపా నుంచి.. మాదిన విమల(పెద్దశ్రీరాంపురం), ఇంటిబెహర యమున(కంచిలి-1) విజయం సాధించారు.


టెక్కలి

కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎస్పీ అమిత్‌బర్దార్‌ , సబ్‌కలెక్టర్‌

నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల లెక్కింపు ప్రక్రియ ఆదివారం కె.కొత్తూరు సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రశాంతంగా జరిగింది.  
వైకాపా నుంచి : గుంట రాజేష్‌(అక్కవరం), పోలాకి ఫల్గుణరావు(అయోధ్యపురం), జనపాన జయలక్ష్మి(బూరగాం), పొందర దేవి(చాకిపల్లి), గురుబెల్లి శ్రీలత(లింగాలవలస), జన్ని మంగమ్మ(మేఘవరం), రౌతు బృందావతి (నర్సింగపల్లి), సుగ్గు అప్పలరెడ్డి (పాతనౌపడా), బమ్మిడి కూర్మారావు(పోలవరం), మన్నేల కిశోర్‌(రావివలస), పేడాడ రమేష్‌(తలగాం), యర్ర సుజాత(టెక్కలి-1), కూన పార్వతి (టెక్కలి-2), సత్తారు ఉషారాణి(టెక్కలి-3), వాకాడ శ్రీధర్‌(టెక్కలి-4), గొండేల సుజాత(టెక్కలి-5), ఆట్ల సరోజనమ్మ(టెక్కలి- 6), పీతల హేమలత(టెక్కలి-7), దేవాది శాంతామణి(టెక్కలి-8), బెండి దేవయాని(తిర్లంగి), చింతాడ శ్రీలత(తొలుసూరుపల్లి)
నందిగాంలో వైకాపా నుంచి... :  సువ్వారి వసంతరావు(బడగాం), సర్లాన విలాసరాణి(దేవళభద్ర), యర్రా చక్రవర్తి(దేవుపురం), రేగల లక్ష్మీకాంతం(దిమ్మిడిజోల), కణితి తరిణమ్మ(హరిదాసుపురం), పరశురాంపురం ప్రేమ(కల్లాడ), రోణంకి ఉషారాణి(కవిటి అగ్రహారం), నడుపూరి భానుమతి (లఖిదాసుపురం), అంబోడి విమలావతి(నందిగాం- 1), నడుపూరి శ్రీరామ్మూర్తి(నందిగాం-2), బార్నాన బాలకృష్ణ (నౌగాం), పూడి ఆశారాణి(పెద్దలవునుపల్లి), మెట్ట సంధ్య(కణితూరు), సైలాడ లావన్న(పెద్దతామరాపల్లి), పిన్నింటి జయరాం(సైలాడ), లవునుపల్లి ధనరాజ్‌(కాపుతెంబూరు)
కోటబొమ్మాళిలో వైకాపా నుంచి : కమ్మకట్టు శ్రీనివాసరెడ్డి (కోటబొమ్మాళి 1),  బోయిన నాగేశ్వరరావు (కోటబొమ్మాళి 2),  బొడ్డు అప్పన్న (చీపుర్లపాడు), నంబాళ్ల రాజశేఖర్‌ (చిన్నసాన), వాన లక్ష్మి (చిట్టివలస), పూజారి సత్యం (హరిశ్చంద్రపురం 1 ),  బగాది మాధవి (హరిశ్చంద్రపురం 2),  అన్నెపు తులసీభాయి (జర్జంగి) పంకు లక్ష్మి (కొత్తపల్లి), దుక్క రోజారాణి (కొత్తపేట),  రోణంకి ఉమ (లఖందిడ్డి), మెండ జగన్నాధరావు  (పెద్దబమ్మిడి), దుంగ శ్రీదేవి (రేగులపాడు), సింగూరు కళ్యాణి  (శ్రీజగన్నాథపురం), తర్ర అప్పలనాయుడు (తిలారు), బొడ్డు విజయలక్ష్మి (పట్టుపురం) హనుమంతు గోవిందరావు (యలమంచిలి).
తెదేపా విజేతలు: కింజరాపు లలితకుమారి (నిమ్మాడ), పట్ట సావిత్రి (సౌడాం), మండల ఎంపీటీసీ విజేతలు (స్వతంత్య్ర): చుక్క లోకనాథం (కురుడు)            
సంతబొమ్మాళిలో వైకాపా నుంచి: బుడ్డ రాజ్యలక్ష్మీ (భావనపాడు),  అంగ మాధవి (మర్రిపాడు), లోపింటి దమయంతి (నౌపడ-1), బత్సల సుధాకర్‌ రావు(నౌపడ-2), సుగ్గు నిర్మలారెడ్డి (హనుమంతునాయుడుపేట), కోత.శ్రీకన్య (వడ్డితాండ్ర), పొందల.తులసమ్మ, (దండుగోపాలపురం), వాడరేవు.జగది (చిన్నతుంగాం), దూబ లక్షి (సంతబొమ్మాళి-1), శిమ్మ.రమణమ్మ (సంతబొమ్మాళి-2), చింతాడ.జయలక్ష్మి (బోరుభద్ర), అట్టాడ.అరుణ (పాలతలాగం), మెరుగు.రాజ్యలక్ష్మీ (ఉమిలాడ), సవరరాజు జొన్న (ఆర్‌.హెచ్‌.పురం),  పనసాన లతాకుమారి(మలగాం), చింతల రాజులు (లక్కివలస), సూరాడ.రాజారావు (మేఘవరం),  నక్క చింతామణి, (కొత్త లింగూడు). తెదేపా నుంచి: మెండ.ఉమ (గోవిందపురం),  మోడి పద్మావతి (నరసాపురం).


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని