ప్రారంభమైన అన్నసత్రం సేవలు
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

ప్రారంభమైన అన్నసత్రం సేవలు


భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న కార్యనిర్వహణాధికారి వాసుదేవరావు

పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ పట్టణంలోని బెవర గోపాలనాయుడు అన్నసత్రం సేవలను ఎట్టకేలకు అధికారులు ప్రారంభించారు. బుధవారం స్థానిక కోటదుర్గమ్మ దేవస్థానం ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో అన్నప్రసాద వితరణ చేశారు. విద్యార్థులెవ్వరూ భోజనాలకు రాకపోవడంతో భక్తులు, పేదలకు అందించినట్లు కార్యనిర్వహణాధికారి టి.వాసుదేవరావు తెలిపారు.

దూరమైనందునే...: ఈ అన్నసత్రం ద్వారా ప్రభుత్వ బాలుర కళాశాల విద్యార్థులకు గతంలో భోజనాలు అందించేవారు. అప్పట్లో కళాశాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగేది. ప్రస్తుతం కళాశాలకు సొంత భవనాలు ఆర్టీసీ డిపో వద్ద నిర్మించారు. దీంతో కళాశాల నుంచి కోటదుర్గమ్మ దేవస్థానం సుదూరంగా ఉండటంతో విద్యార్థులు హాజరుకాలేకపోతున్నారు. కళాశాలకు సమీపంలో అనువైన చోట అన్నసత్రం సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని