పీహెచ్‌సీలో కేంద్రబృందం పరిశీలన
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

పీహెచ్‌సీలో కేంద్రబృందం పరిశీలన

నరసన్నపేట మండలం ఉర్లాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కేంద్ర జాతీయ నాణ్యతా ప్రమాణాల అధికారులు (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) అధికారులు బుధవారం పరిశీలించారు. బృంద సభ్యులు గజేంద్రసింగ్‌, ఎ.ఎం.ఎ.వాసంత్‌ ఆసుపత్రిలో దస్త్రాలను పరిశీలించారు. ఎంతమంది రోగులకు సేవలందిస్తున్నారు, గర్భిణులు, బాలింతల వివరాలను వైద్యాధికారిణి సుజాతను అడిగి తెలుసుకున్నారు.

- న్యూస్‌టుడే, ఉర్లాం(నరసన్నపేట గ్రామీణం)


రేపటి పౌరులు.. నేటి కష్టాలు

కంచిలి మండలం ఘాటిముకుందాపురం, పోలేరు, ముండ్ల, డీజీ పురం, ఏక్కల, కేబీ నౌగాం, కేసరిపడా, ఎంఎస్‌.పల్లి, కొల్లూరు, బొగాబెణి, తదితర పంచాయతీల విద్యార్థులు సకాలంలో పాఠశాల, కళాశాలలకు చేరుకోవాలంటే అరకొరగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులలో ఇదిగో ఇలా వేలాడుతూ ప్రయాణం చేయాల్సిందే. ఉదయం, సాయంత్రం కేవలం రెండు బస్సులు మాత్రమే నడుస్తుండడంతో ఈ తిప్పలు. అదనపు బస్సులు నడిపించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కంచిలి

 


నిన్న 45... నేడు 104

 

కోటబొమ్మాళిలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం వరకు 45 మంది విద్యార్థులే ఉండేవారు. బుధవారానికి ఆ సంఖ్య కాస్తా ఒక్కసారిగా 104 మందికి పెరిగింది. సమీపంలోని సీబీఎం పాఠశాల (ఎయిడెడ్‌)ను మూసివేయడంతో 59 మంది విద్యార్థులు అక్కడి నుంచి ఈ పాఠశాలకు వచ్చి చేరారు.

- న్యూస్‌టుడే, కోటబొమ్మాళి


పడిపోయినా పట్టించుకోలేదు..

 

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మూడో అంతస్థులోని వార్డులో బుధవారం ఓ మహిళ దయనీయ పరిస్థితిలో కనిపించింది. ఒంటిపై కనీసం దుస్తులు లేకుండా మంచం మీది నుంచి కిందపడిపోయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ ఆసుపత్రి రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా ఒడిశాకు చెందిన మహిళ మతిస్థిమితం లేక గత రెండు నెలలుగా చికిత్స పొందుతుందున్నారని, అప్పటి నుంచి సిబ్బంది ఆమెకు సేవలందిస్తున్నారని చెప్పారు.

- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని